ట్విటర్లో డైలీ ఫాలోవర్స్ లిమిట్ తగ్గింపు

ట్విటర్లో డైలీ ఫాలోవర్స్ లిమిట్ తగ్గింపు

కొంతకాలంగా యూజర్లకు మరింత అనుకూలమైన చర్యలు చేపడుతున్న ‘ట్విట్టర్’తాజాగా మరో నిర్ణయం తీసుకుంది .ఒక రోజులో ఫాలోవర్ల లిమిట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది. గతంలో ఒకరోజు వెయ్యి మందిని ఫాలోఅయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు దీన్నినాలుగు వందలకు తగ్గించింది. అంటే ఎవరైనా ఒక రోజుకు నాలుగు వందల కంటే ఎక్కువ మంది యూజర్లను ఫాలో అవ్వడానికి వీల్లేదు. దీనివల్ల అసంబద్ధంగా వ్యవహరించే యూజర్లకు అడ్డుకట్ట పడుతుందని తెలిపింది.కొం తమంది ట్విట్టర్ యూజర్లు ఫాలోవర్లను పెంచు కునేందుకు రోజుకు వెయ్యి మందిని ఫాలో అవుతుంటారు. కొంతకాలంలోపు వాళ్లలో తిరిగి తమను ఫాలో అయ్యే వారిని మాత్రమే ఫాలో అవుతూ, మిగతా వాళ్లను అన్ ఫాలో చేస్తుంటారు. ఇలాంటి చర్యలకు పాల్పడే స్పామర్లకు అడ్డుకట్ట వేసేందుకు రోజులో ఫాలోవర్ల సంఖ్యను తగ్గించి నట్లు ట్విట్టర్ తెలిపింది. ఇది 99.87 శాతం మంది యూజర్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించదని,అతి తక్కువ మందిపై మాత్రమే ప్రభావం చూపుతుం దని అభిప్రాయపడింది.