స్పామ్ మేసేజ్ తగ్గించేందుకు Twitter DM సెట్టింగ్స్ అప్‌డేట్..

డైరెక్ట్ మేసేజ్ లలో (DMలు) స్పామ్ సమస్య ఉన్నట్లు Twitter అంగీకరించింది. ఈ సమస్యను అధిగమించేందుకు కంపెనీ డీఫాల్ట్ DM సెట్టింగ్‌ల్లో  మార్పులు చేసింది. ఇకపై మీరు అనుసరించని యూజర్ల నుంచి మేసేజ్ లు రిక్వెస్ట్ (Message Request) విభాగానికి మళ్లించబడతాయి.  మీరు అనుసరించే  వ్యక్తులనుంచి డైరెక్ట్ మేసేజ్ లు వాటంతట అవే ఇన్ బాక్స్లోకి వస్తాయి. దీంతోపాటు Twitter బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వ్యక్తుల నుంచి వచ్చిన మేసేజ్ లు కూడా (Message Request) లో ఉంచడబడతాయి.  

కొత్త సెట్టింగ్ ఇప్పటికే లైవ్ లో ఉంది. ఇన్ బాక్స్ లలో స్పామ్ ను తగ్గించడంలో సహాయపడుతుందని, జూలై 14 నుంచి కొత్త మేసేజ్ సెట్టింగ్లను జోడించామని ట్విట్టర్ తెలిపింది. కొత్త సెట్టింగ్ తో మీరు అనుసరించే యూజర్ల మేసేజ్ లు మీ ప్రాథమిక ఇన్బాక్స్ కు వస్తాయి. మీరు అనుసరించని ట్విట్టర్ సబ్ స్క్రైబర్ యూజర్లనుంచి వచ్చిన మేసేజ్ లు మేసేజ్ రిక్వెస్ట్ ఇన్ బాక్స్ కు వెళతాయి. 

Twitter తన DMల FAQ పేజీని కూడా ఆధునీకరించింది. ట్వీట్‌లో పేర్కొన్నట్లుగా వినియోగదారులు తమ పాత Twitter DM సెట్టింగ్‌ని కలిగి ఉండాలనుకుంటే తిరిగి వెళ్లవచ్చు. డెస్క్‌టాప్ వెర్షన్‌లో DM సెట్టింగ్‌లను మార్చడానికి ఇన్‌బాక్స్‌ని తెరిచి, ఎగువ కుడి వైపున సెట్టింగ్‌ల మెనూ క్లిక్ చేయాలి. మీరు అనుసరించే వ్యక్తుల నుంచి సందేశాలను పొందవచ్చు. Allow messages from people you follow", "allow message request from only verified users", or "allow message request from everyone ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 

అయితే కొత్త సెట్టింగ్ లతో యూజర్లకు చాలా లాభాలు ఉన్నాయని ట్విట్టర్ తెలిపింది. మేసేజ్ రిక్వెస్ట్ ఇన్ బాక్స్ లో మేసేజ్ లను తనంతటతాను క్రమబద్ధీకరిస్తుంది.  DMలు మా సామాజిక   సంబంధాలను  విస్తరించడానికి , వ్యాపార అవకాశాలను సులభతరం చేయడానికి విలువైన సాధనంగా ఉపయోగపడతాయి.అయితే ఇది ఎల్లప్పుడు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు.సాధారణ వినియోగదారులతో కనెక్ట్ కావడం ద్వారా జర్నలిస్టులకు కథనాలను అందించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఏదేమైనప్పటికీ మెటా థ్రెడ్స్ పుట్టించిన వేడికి ఉపశమనంగా ట్విట్టర్ చేపట్టిన ఈ చర్యలతో యూజర్లను మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. 

కాగా.. ఇటీవల, మెటా సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ప్రారంభించిన థ్రెడ్స్ యాప్.. కేవలం 72 గంటల్లో 100 మిలియన్ల సైన్-అప్‌లను పొందాయని ప్రకటించారు. థ్రెడ్‌లు తప్పనిసరిగా 1 బిలియన్‌కు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఇన్‌స్టాగ్రామ్ పొడిగింపు కాబట్టి ఎక్కువ మంది వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో చేరే అవకాశం కూడా ఉంది. ట్విట్టర్ కూడా పాత వినియోగదారులను నిలుపుకునేందుకు, కొత్త యూజర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇటీవల వినియోగదారులు తమ ట్వీట్లతో డబ్బు సంపాదించడానికి కంపెనీ తన విధానాన్ని అప్ డేట్ చేసింది. ప్రకటన రాబడి భాగస్వామ్య ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేయడం ద్వారా ఇది చేయవచ్చు.