ట్విట్టర్‌కు పోటీగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ త్రెడ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చారు. లాంచ్ అయిన రెండున్నర గంటల్లోనే 10 లక్షల యూజర్లు ‘త్రెడ్స్’ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు సుమారు 200 కోట్లు ఉంటారని అంచనా. దీంతో ఈ ప్లాట్‌ఫామ్ నుంచి త్రెడ్స్‌కు యూజర్లు మారడం ఈజీగా ఉంటుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ట్విట్టర్ ఫెయిలైందని జూకర్‌బర్గ్ కామెంట్ చేయగా.. త్రెడ్స్ కాపీ పేస్ట్ అని ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ ఎద్దేవా చేశారు.
- యాడ్స్ లేకుండా అందుబాటులోకి..
- ట్విట్టర్ ఫెయిలైందంటున్న మార్క్ జూకర్‌బర్గ్..కాపి పేస్ట్ అంటున్న మస్క్
బిజినెస్ డెస్క్, వెలుగు : లాంచ్ అయిన రెండున్నర గంటల్లోనే 10 లక్షల యూజర్లు, ఏడు గంటల్లోనే కోటి యూజర్లు.. ట్విట్టర్‌కు పోటీగా మార్క్ జూకర్‌బర్గ్ తీసుకొచ్చిన త్రెడ్స్ యూజర్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో రోజువారి యాక్టివ్ యూజర్ల సంఖ్య 20 కోట్ల పైనే ఉంటుందని అంచనా. గతంలో కూడా చాలా కంపెనీలు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినా, సక్సెస్ కాలేకపోయాయి. కానీ, త్రెడ్స్ బలంగా స్టార్టయ్యిందని చెప్పొచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు సుమారు 200 కోట్లు ఉంటారని అంచనా. దీంతో ఈ ప్లాట్‌ఫామ్ నుంచి త్రెడ్స్‌కు యూజర్లు మారడం ఈజీగా జరుగుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
సుమారు 100 దేశాల్లో బుధవారం రాత్రి 11 గంటలకు త్రెడ్స్ యాప్‌ను యాపిల్, ఆండ్రాయిడ్ స్టోర్లలో లాంచ్ చేశారు. ప్రస్తుతానికి ఈ యాప్‌లో ఎటువంటి యాడ్స్ లేవు. ‘ఏడు గంటల్లోనే కోటి రిజిస్ట్రేషన్లు’ అని జూకర్‌బర్గ్ తన అఫీషియల్ త్రెడ్ అకౌంట్ నుంచి కామెంట్ చేశారు. కొంత మంది హాలివుడ్ యాక్టర్లు, ఫేమస్ పర్సనాలిటీస్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. త్రెడ్స్ లాంచ్ అయిన తర్వాత జూకర్‌బర్గ్ కొన్ని గంటల పాటు కొత్త యూజర్లకు రిప్లై ఇచ్చారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఆయన రిప్లై ఇచ్చారు. ఎంఎంఏ ఫైటర్ జాన్ జోన్స్‌ను ఉద్దేశిస్తూ ..‘త్రెడ్స్‌లో ఎంఎంఎ వరల్డ్ ఛాంపియన్ ఫైటర్లు పెరిగారు. ముఖ్యంగా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి’ అని పేర్కొన్నారు.
అవకాశం దొరికింది...పట్టుకున్నాడు.
ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం అనేక గందరగోళాల మధ్య జరిగింది. మస్క్ టేకోవర్ చేశాక బ్లూటిక్, లిమిటెడ్ వ్యూస్ వంటి అనేక చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆయన తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలతో చాలా మంది అడ్వర్టయిజర్లు కూడా ట్విట్టర్‌కు దూరమయ్యారు. ట్విట్టర్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్న వారికి త్రెడ్స్ కనిపిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
ట్విట్టర్ ఇబ్బందుల్లో ఉండడాన్ని చూసి జూకర్‌బర్గ్ సరికొత్త యాప్‌తో వచ్చాడని, సెలబ్రెటీలు, కంపెనీలు, పొలిటీషియన్లు తమ ఫాలోవర్లతో టచ్‌లో ఉండేందుకు త్రెడ్స్‌ను మెటా తెచ్చిందని అన్నారు. మెస్సి, కర్దేషియన్ లేదా బీబర్ వంటి ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న సెలబ్రెటీలు త్రెడ్స్ వాడితే ఆటోమెటిక్‌గా ఈ ప్లాట్‌ఫామ్‌లో యూజర్లు పెరుగుతారని పేర్కొన్నారు.
ట్విట్టర్‌లో త్రెడ్స్ హల్‌చల్..
ట్విట్టర్‌లో హాట్ టాపిక్‌గా త్రెడ్స్ నిలిచింది. త్రెడ్స్ హ్యాష్‌టాగ్‌తో గ్లోబల్‌గా 10 లక్షల ట్వీట్లు జరిగాయి.
ట్విట్టర్, త్రెడ్స్‌కు తేడా..
1. త్రెడ్స్‌లో వెరిఫైడ్ అకౌంట్ అయితే 500 క్యారెక్టర్ కౌంట్ వరకే పోస్ట్ చేయడానికి ఉంటుంది. అదే వెరిఫై కాని అకౌంట్ అయితే 280 క్యారెక్టర్ల వరకే పరిమితి ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ బ్యాడ్జ్ ఉన్నవాళ్లు త్రెడ్స్‌లో అదే బ్యాడ్జ్‌తో కొనసాగొచ్చు. ట్విట్టర్‌లో అయితే బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్లు ఖర్చు చేయాలి. బ్లూటిక్ ఉన్నవారు 25 వేల క్యారెక్టర్స్ వరకు ట్వీట్ చేసుకోవచ్చు.
2. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నే త్రెడ్స్‌లో
వాడుకోవచ్చు.
3. వెరిఫై చేసుకోని అకౌంట్స్ కూడా త్రెడ్స్‌లో ఐదు నిమిషాల లాంగ్ వీడియోలను షేర్ చేసుకోవచ్చు. కానీ, ట్విట్టర్‌లో బ్లూబ్యాడ్జ్ లేని వారు రెండు నిమిషాల 20 సెకెన్ల కంటే ఎక్కువ ఉన్న వీడియోలను పోస్ట్ చేయడానికి వీలుండదు.
4. ట్విట్టర్‌లో ట్రెండింగ్ టాపిక్స్ కోసం సపరేట్ ట్యాబ్ ఉంది. కానీ, త్రెడ్స్‌లో ప్రస్తుతానికి ఈ ఫీచర్ లేదు.
5. ట్విట్టర్‌లో ఉన్నట్టు త్రెడ్స్‌లో పోస్టులను సేవ్ చేసుకునే వెసులుబాటు ప్రస్తుతానికి లేదు.
6. అకౌంట్లను బ్లాక్ చేయడం, మూట్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ మాదిరే త్రెడ్స్‌లో రూల్స్ ఉన్నాయి. త్రెడ్స్‌లో యాడ్స్ లేవు.
ALSO READ:బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు!..రెండు వారాల్లో ప్రకటన
11 ఏళ్ల తర్వాత జుకర్‌బర్గ్ ట్వీట్..
11 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ట్విట్ చేసిన జూకర్‌బర్గ్, ఎలన్ మస్క్‌ను, ట్విట్టర్‌ను విమర్శించారు. త్రెడ్స్, ట్విట్టర్ ఒకేలా ఉన్నాయనే అర్థం వచ్చేలా స్పైడర్‌మ్యాన్‌ను చూపించే స్పైడర్‌మ్యాన్ ఫొటోను ట్వీట్ చేశారు. తర్వాత త్రెడ్‌లో ట్విటర్ ఫెయిలైందని పేర్కొన్నారు. ‘ టైమ్ పట్టొచ్చేమో కానీ, 100 కోట్లకు పైగా యూజర్లు వాడుకునేలా ఓ కన్వర్జేషన్ యాప్ ఉండడం అవసరమని భావిస్తున్నాను.
ట్విట్టర్‌కు ఆ అవకాశం వచ్చినా వాడుకోలేకపోయింది. మేము సాధిస్తామని నమ్ముతున్నా’ అని జూకర్‌బర్గ్ అన్నారు. త్రెడ్స్ ట్విట్టర్‌కు కాపి అనే అర్థం వచ్చేలా కీబోర్డ్‌లోని కంట్రోల్+సీ , వీ ఫొటో ట్విట్టర్‌లో షేర్ అవ్వగా, మస్క్ దీనికి సమాధానంగా నవ్వుతున్న ఎమోజిని ట్వీట్ చేశారు.