జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి పేర్నినాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రిపబ్లిక్ మూవీ వేడుకలో ఏపీ ప్రభుత్వం, సినీమా ఇండస్ట్రీపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఈ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం నష్టాలకు గురి చేస్తుందని..ఆన్ లైన్ సినిమా టికెట్ విధానం, వైసీపీ నేతలను సన్నాసులు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు పవన్.
పవన్ చేసిన వ్యాఖ్యలపై నిన్న(సోమవారం) పోసాని మురళీ కృష్ణ విమర్శలు చేశారు. పవన్ కు ప్రపంచ జ్ఞానం లేదని,పుస్తక జ్ఞానం లేదన్నారు. పవన్ వ్యాఖ్యలు అర్థరహితమని..పవన్ జగన్ తో పోల్చుకోవద్దని సూచించారు. దీనికి కౌంటర్ గా పవన్ తన ట్విట్టర్లో విమర్శలు చేశారు.‘ తుమ్మెదల ఝంకారాలు, నెమళ్ల క్రేంకరాలు, ఏనుగల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు హు లెట్ ది డాగ్స్ ఔట్ అనే సాంగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఇది తనకిష్టమైన పాటల్లో ఒకటి అని అన్నారు.
తుమ్మెదల ఝుంకారాలు
— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
నెమళ్ళ క్రేంకారాలు
ఏనుగుల ఘీంకారాలు
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు
సహజమే …
దీనికి మంత్రి పేర్ని నాని అదే రీతిలో రీ కౌంటర్ ఇచ్చారు.‘ జనం ఛీత్కారాలు ,ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు అంటూ బదులిచ్చారు. అలాగే చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వంగి వంగి దండాలు పెడుతున్న వీడియోను పోస్ట్ చేశారు.
జనం ఛీత్కారాలు
— Perni Nani (@perni_nani) September 27, 2021
ఓటర్ల తిరస్కారాలు
తమరి వైవాహిక సంస్కారాలు
వరాహ సమానులకు న'మస్కా'రాలు @PawanKalyan