
న్యూఢిల్లీ: శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్) లోని ట్విట్టర్ పాత హెడ్‌క్వార్టర్‌పై ఉన్న బ్లూ బర్డ్ సైన్‌ను సుమారు రూ.24 లక్షలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ అమ్మింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొన్న తర్వాత పేరు, లోగోను మార్చిన విషయం తెలిసిందే. ఈ బ్లూ బర్డ్ సైన్ బరువు 254 కేజీలు.
పొడవు 3.7 మీటర్లు. వెడల్పు 2.7 మీటర్లు. ట్విట్టర్ పాత ఆఫీస్‌లోని చాలా ఐటెమ్స్‌ను మస్క్ వేలం వేశారు. ఇందులో సైన్ బోర్డులు, కిచెన్ ఎక్విప్‌మెంట్, ఆఫీస్ ఫర్నిచర్ వంటివి ఉన్నాయి. 2023 లోనూ ఈ హెడ్‌క్వార్టర్‌పై ఉన్న ఓ బ్లూ బర్డ్ సైన్‌ను రూ.87 లక్షలకు అమ్మారు.