
హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కోరింది. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య నేతృత్వంలో ప్రతినిధి బృందం మంగళవారం అసెంబ్లీ లో సీఎంను కలిసి వినతి పత్రం సమర్పించింది.
ఇండ్ల స్థలాలు, ఆరోగ్య బీమా పథకం, అక్రెడిటేషన్ కార్డులు, పెన్షన్ పథకం, మహిళా జర్నలిస్టులకు రాత్రి సమయంలో రవాణా సౌకర్యం, అర్హత ఉన్న చిన్న, మధ్యతరహా పత్రికలకి ఎన్ ప్యానల్ మెంట్, తదితర సమస్యలు పరిష్కరించాలని సీఎం ను కోరారు.
టీడబ్లూ జే ఎఫ్ వినతిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రాజశేఖర్, గుడిగ రఘు, హెచ్ యూజే అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్, నాయకులు క్రాంతి, సీనియర్ జర్నలిస్టులు జాన్ రాస్, రాజేశ్ జైన్, గంగాధర్, పూర్ణ చంద్ర రావు, బస్వ రాజ్ తదితరులు పాల్గొన్నారు.