
హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఆరోగ్య బీమా పథకం, అక్రెడిటేషన్ కార్డులు, పెన్షన్ పథకం, మహిళా జర్నలిస్టులకు రాత్రి సమయంలో రవాణా సౌకర్యం, అర్హత ఉన్న చిన్న, మధ్యత రహా పత్రికలకి ఎన్ ప్యానల్ మెంట్, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.
సీఎంను కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య, ఉపాధ్యక్షుడు బి. రాజశేఖర్, హెచ్ యూజే అధ్యక్షుడు బి. అరుణ్ కుమార్, హెచ్ యూ జే నాయకుడు క్రాంతి, సీనియర్ జర్నలిస్టులు జాన్ రాస్, గంగాధర్, పూర్ణ చందర్ రావు,ఎం.బస్వరాజ్ తదితరులు ఉన్నారు.
ALSO READ | ట్రిపుల్ ఆర్ పూర్తయితే సిటీ రూపు రేఖలు మారుతయ్: మండలిలో మంత్రి కోమటిరెడ్డి