పాక్​లో 2 ప్రమాదాలు..16 మంది దుర్మరణం

పాక్​లో 2 ప్రమాదాలు..16 మంది దుర్మరణం

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో విషాదం చోటు చేసుకుంది. సింధ్ ప్రావిన్స్ లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో16 మంది చనిపోగా, 45 మందికి గాయాలయ్యాయి. షహీద్‌‌‌‌ బెనజీరాబాద్‌‌‌‌ జిల్లాలోని ఖాజీ అహ్మద్‌‌‌‌ టౌన్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌‌‌‌ ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఐదుగురు మరణించారు. 

మరో 10 మంది గాయపడ్డారు. వేగంగా ప్రయాణిస్తున్న వ్యాను.. తొలుత గాడిద బండిని ఢీకొట్టి ఆ  తర్వాత ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సింధ్ ప్రావిన్స్ లోని ఖైర్పూర్ సమీపంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 35 మందికి గాయాలయ్యాయి.