సదరం సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం అడిగితే.. ఏమైందంటే?

సదరం సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం అడిగితే.. ఏమైందంటే?

పెద్దపల్లి జిల్లా : అవినీతికి పాల్పడ్డ ఇద్దరు ఆరోగ్య శ్రీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికేట్ జారీ చేయడానికి లంచం డిమాండ్ చేశారు. సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే రూ.20 వేల లంచం ఇవ్వాలని వికలాంగుని అడిగారు. బాధితుడు ఫిర్యాదుతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు.