హైదరాబాద్,వెలుగు: కార్లను కిరాయికి తీసుకుని అమ్మేస్తున్న ఇద్దరిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రూ.40లక్షల విలువైన 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ సిటీ కిషన్‌బాగ్‌కి చెందిన మహ్మద్ సల్మాన్ అలియాస్ డాన్(30) కార్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈజీ మనీ కోసం స్కెచ్ చేశాడు. విలువైన కార్లను కిరాయికి, ఎంగేజ్‌కి తీసుకునేవాడు. వాటిని సెకండ్ సేల్స్‌లో అమ్మేసేవాడు.
ఓనర్లు కంప్లయింట్ చేయడంతో సైదాబాద్ పీఎస్‌లో కేసు నమోదై జైలుకెళ్లాడు. రిలీజ్ అయ్యాక ఫ్రెండ్ మహ్మద్ హుస్సేన్(21)తో కలిసి ఆసిఫ్‌నగర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట పీఎస్ లిమిట్స్‌లో 3 కార్లను రెంట్‌కి తీసుకుని అమ్మేశారు. ఆసిఫ్‌నగర్ పీఎస్‌లో నమోదైన కేసులో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్టు టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ సల్మాన్, హుస్సేన్‌ను డీసీసీ అభినందించారు.