కృష్ణ జింకల మాంసం అమ్ముతూ దొరికిపోయారు.. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు అరెస్టు

కృష్ణ జింకల మాంసం అమ్ముతూ దొరికిపోయారు.. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు అరెస్టు

వణ్యప్రాణులను మాసం కోసం చంపడం చట్టపరంగా నేరం అనే విషయం తెలిసి కూడా కొందరు అడవి జంతువులను వేటాడుతూనే ఉన్నారు. గుట్టు చప్పుడు కాకుండా మాంసం అమ్ముతూ సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాత్కాలిక ఆదాయ మార్గాల కోసం ప్రయత్నించి మంచిర్యాల జిల్లాలో ఇద్దరు అరెస్టయ్యారు.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఇద్దరిని పట్టుకున్నారు అటవీశాఖ అధికారులు.  వన్యప్రాణులను వేటాడి మాంసాన్ని అమ్ముతున్న ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్ రెడ్డి, గూడ పాపన్న అనే ఇద్దరు గ్రామస్థులు గ్రామ పొలాల సమీపంలో రెండు కృష్ణ జింకలను వేటాడినట్లు ఎఫ్ ఆర్ వో రత్నాకర్ తెలిపారు. నిందితులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.