మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలతో ఇద్దరు అరెస్ట్

మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలతో ఇద్దరు అరెస్ట్
  • 140 కిలోలు స్వాధీనం చేసుకున్న మంచిర్యాల జిల్లా పోలీసులు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: నకిలీ పత్తి విత్తనాలతో ఇద్దరు పట్టుబడిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఎస్ఐ గంగారాం, వ్యవసాయాధికారి సాయిప్రశాంత్​తెలిపిన ప్రకారం.. కన్నెపల్లి మండలం సుర్జాపూర్​లో ఓ వ్యక్తి ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు నిల్వ చేసినట్టు సమాచారం అందింది. ఆదివారం వెళ్లి బేరి నారాయణ ఇంట్లో తనిఖీలు చేసి 140 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

వాటి విలు సుమారు రూ.3.50 లక్షలు ఉంటుంది.  నారాయణ ఇంట్లో వెంకటాపూర్​ గ్రామానికి చెందిన కొండగొర్ల  రాజన్న నాలుగు బస్తాలు దాచి ఉంచాడు.  ఏపీకి చెందిన సురేశ్​అనే వ్యక్తి  తీసుకొచ్చినట్టు తాండూర్​ సీఐ కుమారస్వామి తెలిపారు. నారాయణ, రాజన్నను అరెస్ట్​ చేసినట్లు, సురేశ్​​పరారీలో ఉన్నట్లు చెప్పారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.