
జైపూర్ (భీమారం), వెలుగు: రెండు ఆటోలు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఏడు మందికి గాయాలైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన అత్కూరి సారయ్య కుటుంబ సభ్యులతో కలిసి చెన్నూర్ లో ఫంక్షన్ కు వెళ్లారు. అనంతరం భీమారం మండలం కొతపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లి ఆటోలో వస్తున్నారు.
భీమారం నుంచి ప్రయాణికులతో మరో ఆటో ఎదురుగా రావడంతో మూల మలుపు వద్ద అదుపు తప్పి మద్దికల్- – ఆరేపల్లి మధ్య రెండు ఆటోలు ఢీకొన్నాయి. మద్దికల్ గ్రామానికి చెందిన చింతం పెంటయ్య (60)కు తీవ్ర గాయాలై స్పాట్ లో చనిపోయాడు. ఆటో డ్రైవర్లు అత్కూరి సారయ్య, దాగం నరేశ్ తో పాటు ప్రయాణికులు సంధ్యారాణి, రోహిత్, మానస, బానేశ్, కమ్మరి శేఖర్ గాయపడ్డారు. 108లో మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఆటో డ్రైవర్లు మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.