బాల్కొండ, వెలుగు: నిజామాబాద్జిల్లా బాల్కొండ మండలం బోదెపల్లిలో గురువారం రాత్రి ఎదురెదురుగా వచ్చిన రెండు ఆటోలు ఢీకొనడంతో డ్రైవర్లతో పాటు 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ నుంచి వన్నెల్(బి)కి ప్యాసింజర్లతో వస్తున్న ఆటో, వన్నెల్(బి)నుంచి బాల్కొండ వస్తున్న ట్రాలీ ఆటో బోదెపల్లి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి.
దీంతో జక్క రుకుంబాయికి రెండు కాళ్లు, కుడి చేయి విరగగా, ఆటో డ్రైవర్ మహిపాల్‌కు కుడి చేయి విరిగింది. ట్రాలీ డ్రైవర్ మిట్ట సునీల్, పక్కన కూర్చున్న సాయిలుకు తలకు గాయాలయ్యాయి. ప్యాసింజర్ ఆటోలోని వన్నెల్(బి)కి చెందిన 4 ఏండ్ల చిన్నారి ఎవాన్సీ, రత్నపురం స్వప్న, రజిత, వినీత, సుమలత స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.