ఒకే నంబర్తో రెండు ఆటోలు.. తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన ఆటోలు

హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఒకే నంబర్ తో రెండు ఆటోలు తిరుగుతున్నాయి.  రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు  ఈ రెండు ఆటోలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

రాజేంద్రనగర్ సర్కిల్ దుర్గా నగర్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒకే రిజిస్ట్రేషన్ తో  ఉన్న రెండు ఆటోలు  కనిపించాయి.  వెంటనే అలర్ట్ అయిన ట్రాఫిక్ పోలీసులు రెండో ఆటోలను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అందులో ఒకటి ఒరిజినల్ రిజిస్ట్రేషన్ మరొకటి అదే నెంబర్ తో  వేరే నెంబర్ ప్లేట్ పెట్టుకొని ఆటో నడిపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.  రెండు ఆటోలను అదుపులోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ | సౌదీ ఎడారిలో : GPS కట్ అయ్యి తెలంగాణ యువకుడు మృతి