దండకారణ్యంలో మరో రెండు కొత్త బేస్​ క్యాంపులు

దండకారణ్యంలో మరో రెండు కొత్త బేస్​ క్యాంపులు
  • మావోయిస్టులపై పోరుకు దూకుడు పెంచిన కేంద్రం 

భద్రాచలం,వెలుగు :  చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో మావోయిస్టులపై పోరు కొనసాగించేందుకు కేంద్ర హోంశాఖ దూకుడు పెంచింది. సుక్మా, బీజాపూర్​జిల్లాల బార్డర్​లోని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు స్వగ్రామం సుక్మా జిల్లా పువ్వర్తిలో ఇప్పటికే ఒక బేస్​ క్యాంపును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఇంకా మారుమూల దండకారణ్యంలోని కొండపల్లి, తుమ్మలపాడు గ్రామాల్లో కూడా మరో రెండు బేస్​ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు సుక్మా, బీజాపూర్​జిల్లాల పోలీసులు, సీఆర్​పీఎఫ్​జవాన్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే బలగాలను అక్కడకు తరలించారు. 


2026 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీపై పూర్తి పట్టు సాధిస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా వ్యాఖ్యలకు అనుగుణంగా కేంద్ర బలగాలు పావులు కదుపుతున్నాయి.  ఈ క్యాంపుల ఏర్పాటుపై మావోయిస్టులు ఎలా స్పందిస్తారో ? అనే ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టుల కోటను దాదాపుగా భద్రతాబలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లేనని పోలీసువర్గాలు  పేర్కొంటున్నాయి.