
- ఊరకుక్కలపై దాడి చేసిన రెండు ఎలుగుబంట్లు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని బెల్కటూర్ గ్రామంలో శుక్రవారం రెండు ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపాయి. బెల్కటూర్ గ్రామంలోని బాల్‌రాం నాపరాతి పాలిషింగ్ యూనిట్లో ఉదయం రెండు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. వీటిని చూసిన వీధి కుక్కలు దాడి చేయడానికి ప్రయత్నించగా ఎలుగుబంటే ఓ కుక్కపై దాడి చేసి నోటి భాగాన్ని కొరికేసింది.
అనంతరం రెండు ఎలుగుబంట్లు పారిపోయాయి. అడవిలో ఉండాల్సిన ఎలుగులు గ్రామంలోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ ధ్రువీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.