బిగ్ బాస్ సీజన్ 18 (Bigg Boss 18) త్వరలో షురూ కానుంది. ఇటీవలే సెప్టెంబర్ 6న ప్రోమో రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. టైమ్ కా తాండవ్ అంటూ ఈ కొత్త సీజన్ కు మరోసారి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
దీంతో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 18 కోసం ప్రేక్షకుల నిరీక్షణ దాదాపు ముగిసింది. ఈ లేటెస్ట్ షో ప్రీమియర్ దగ్గర పడుతుండంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. మొన్నటివరకు తెలుగు బిగ్ బాస్ కోసం ఎలా అయితే..వీరే కంటెస్టెంట్స్ అంటూ ఇదిగో..అదిగో..అని ఎలా అయితే విన్నామో..ఇక ఇప్పుడు హిందీ బిగ్ బాస్ సీజన్ 18 లో వింటున్నాం.
Also Read :- బాక్సులు బ్లాస్ట్ చేసే 'ఆయుధపూజ' పాట ముహూర్తం ఖరారు
తాజాగా బిగ్ బాస్ సీజన్ 18 కంటెస్టెంట్స్లో మన తెలుగు నుంచి ఒకప్పటి హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. వాళ్లలో ఒకరు సమీరా రెడ్డి కాగా.. మరొకరు అనిత. ఎన్టీఆర్ తో కలిసి అశోక్, నరసింహుడు వంటి మూవీస్ లో సమీరా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
అనిత విషయానికి వస్తే..హీరో ఉదయ్ కిరణ్ నటించిన 'నువ్వు నేను'సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఈ ఇద్దరితో పాటు ఆర్జీవీ సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసిన మరో నటి ఇషా కొప్పికర్ కూడా హౌజ్లో సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నఈ బ్యూటీ ఆ తర్వాత అదే స్టార్ డమ్ కాపాడుకోలేకపోయింది.
తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్, ముసలోడికి దసరా పండగ వంటి చిత్రాల్లో నటించింది. నువ్వు నేను తర్వాత ఆ స్థాయిలో హిట్ రాకపోవడంతో ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం వీరు బిగ్ బాస్ సీజన్ 18 లో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. త్వరలో ఈ షో ప్రీమియర్ డేట్ను బిగ్ బాస్ యాజమాన్యం ప్రకటించే అవకాశం ఉంది.
ప్రముఖ టీవీ నటి నియా శర్మ ఈ సీజన్‌కు కంటెస్టెంట్స్ లిస్టులో ఒకరిగా ఉన్నారంటూ అధికారిక అప్‌డేట్ వచ్చింది. ఆమె పాల్గొనడం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.