తిరుమల ఘాట్ రోడ్డులో.. బస్సు ఢీకొని ఇద్దరు బైకర్స్ మృతి

తిరుమలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.రెండవ ఘాట్‌రోడ్డులో బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఘాట్ రోడ్డులోని చివరిమలుపు వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది.మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి క్రేన్‌ సాయంతో మృతదేహాలను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. మృతులు తమిళనాడుకు చెందిన దంపతులుగా భావిస్తున్నారు పోలీసులు.

తిరుపతి నుండి తిరుమల వెలుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.