
శివ్వంపేట, వెలుగు: రెండు బైక్లు ఎదురెదుగారు వచ్చి ఢీకొనడంతో ముగ్గురికి గాయాలై ఘటన ఆదివారం శివ్వంపేట మండల కేంద్రంలో జరిగింది. మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన తండ్రి కొడుకులైన హమీద్, జావేద్లు చంది గ్రామంలో ఉన్న తమ చికెన్ సెంటర్కు బైక్పై వెళ్తున్నారు.
ఎదురుగా మహేశ్, మరో వ్యక్తి బైక్పై వస్తుండగా రెండు బైక్లు ఎదురెదురుగా వచ్చిఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో జావేద్కు తీవ్ర గాయాలు కాగా హైద రాబాద్ లోని ఓ హాస్పిటల్కు తరలించారు. మరో ఇద్దరికి స్థానిక హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.