- సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు
- ఔట్ సోర్సింగ్ సంస్థకు నోటీసు
వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ఎంజీఎం ఆస్పత్రిలో రెండు బయోమెట్రిక్ మెషీన్లు చోరీ అయ్యాయి. ఆస్పత్రి ఆర్ఎంఓలు, సూపరింటెండెంట్లతోపాటు పేషెంట్లు, సెక్యూరిటీ గార్డులు నిత్యం తిరిగే ఏరియాలో చోరీ జరగడం విశేషం. మంగళవారం ఉదయం 8 గంటలకు డ్యూటీకి వచ్చిన నర్సులు బయోమెట్రిక్ మెషీన్ల వద్దకు వెళ్లగా కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని గుర్తించి ఆస్పత్రి ఉన్నతాధికారులకు తెలిపారు.
సీసీ ఫుటేజిని పరిశీలించి చోరీ అయ్యాయని తెలుసుకుని మట్టెవాడ పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆస్పత్రిలోని సెక్యూరిటీ సంస్థకు అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా చోరీలు జరిగాయి. పోలీసులకు సైతం కంప్లయింట్లు చేశారు. దొంగలు దొరకలేదు. చోరీలను నివారించడానికే సీసీ కెమెరాలను ఇటీవల భారీగా ఏర్పాటు చేశారు. అయినా.. సీసీ కెమెరాలనే ఎత్తుకెళ్లారు. ఇప్పటికైనా దొంగలను పట్టుకుంటారో చూడాలి.