హైదరాబాద్: నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని ‘భారత మాత ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లు ప్రమాదానికి కారణమయ్యాయి. హుస్సేన్ సాగర్లో రెండు బోట్లలో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రమాదవశాత్తు దగ్ధమైంది.
ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో హుస్సేన్ సాగర్లో రెండు బోట్లు కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి, నాగఫణిశర్మ తదితరులు హాజరయ్యారు.
#WATCH | Hyderabad, Telangana | A boat catches fire in Hussain Sagar Lake. More details awaited. pic.twitter.com/5Qg1VoYdOj
— ANI (@ANI) January 26, 2025