వరంగల్ లో హైటెక్ క్రికెట్ బెట్టింగ్

వరంగల్ లో భారీగా జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ ను ఛేదించారు పోలీసులు. 2కోట్ల 5లక్షల నగదును సీజ్ చేశారు. వివిధ బ్యాంకుచెందిన పాస్ బుక్స్, ఏటీఎం కార్డులు, చెక్ బుక్ లను స్వాధీనం చేసుకున్నారు. గత మూడు నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో.. బెట్టింగ్ ద్వారా భారీఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు వరంగల్ పోలీసులు. హనుమకొండకు చెందిన మాడిశెట్టి ప్రసాద్, మహారాష్ట్రకు చెందిన అభయవిలాస్ షెట్కార్ అరెస్ట్. ముంబై కేంద్రంగా ఆన్ లైన్ లో మూడు ముక్కలాట బెట్టింగ్ కు పాల్పడుతున్నారని తెలిపారు పోలీసులు.