వరంగల్ కెనాల్‌లో పడి ఇద్దరు బాలురు గల్లంతు

హన్మకొండ పెద్దమ్మగడ్డలో ఘటన

వరంగల్ క్రైమ్, వెలుగు: హన్మకొండ పెద్దమ్మగడ్డ కెనాల్ లో ఇద్దరు బాలురు గల్లంతైన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మగడ్డ కు చెందిన చుక్క రాదిల్(17), దరిగి వెంకట్(14) ఇద్దరు ఫ్రెండ్స్​. సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్ ఉండడంతో ఇద్దరూ కలిసి ఈత కొట్టడానికి అక్కడికి వెళ్లేవారు. ఆదివారం వరకు వాటర్ ఫ్లో తక్కువగా ఉండడంతో అక్కడే సరదాగా గడిపి వచ్చేవారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కూడా ఇద్దరు కలిసి ఈతకు వెళ్లారు. సాయంత్రం అయినా ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో కెనాల్ వద్ద వారిద్దరి బట్టలు, చెప్పులు చూసి ఇద్దరూ గల్లంతు అయినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక కార్పొరేటర్ డిన్నాకు సమాచారం అందించడంతో ఆయన  కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఏసీపీ జితేందర్ రెడ్డికి  సమాచారం అందించారు. దీంతో వెంటనే హన్మకొండ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రయినా పిల్లల ఆచూకీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సారెస్పీ కెనాల్ లో వాటర్ ఫ్లో ఎక్కువుండడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది.

For More News..

షెడ్యూల్ ఏరియాల్లో ఆస్తుల సర్వే నిలిపివేయాలి

యోగి రాజ్యంలో దళితులకు రక్షణ  లేదు

ప్రకృతి వనాలకు ఎస్సీల భూములా?