ఇద్దరు అన్నదమ్ముల్ల వల్ల మునుగోడు అభివృద్ధి జరగలేదు : మంత్రి ఎర్రబెల్లి

8 ఏండ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిందని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. విభజన చట్టం హామీలు నిలపెట్టుకోలేదని, 170 మెడికల్ కాలేజీలు వచ్చినా తెలంగాణకు ఇవ్వలేదని ఆరోపించారు. మునుగోడుని కేటీఆర్ దత్తత తీసుకుంటే మీకేం నొప్పి అంటూ ఎర్రబెల్లి.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని నిలదీశారు. కేసీఆర్ నాగార్జున సాగర్ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నాడన్న ఆయన.. దుబ్బాక హుజురాబాద్ లో గెలిచి కేంద్రం నుండి ఏం నిధులు తీసుకు వచ్చారన్నారు.హైదరాబాద్ వరదలలో నష్టపోయిన వారిని ఆదుకుంటామని మోసం చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. 2016 లో చౌటుప్పల్ లో రీసెర్చ్ కేంద్రం పెడతానన్నారని.. మర్రిగూడలో 300 పడకల హస్పిటల్ పెడతానన్నారు.. కానీ అదీ లేదని విమర్శించారు. 

ఫ్లోరైడ్ బాధితులకు ఆర్దిక సహాయం చేస్తామని చెప్పినా, అదీ చేయలేదని ఎర్రబెల్లి చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ లేకుండా చేసింది కేసీఆర్ అని కేంద్ర జలవనరుల మంత్రి మెచ్చుకున్నారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. 8 వేల 80 లక్షల కోట్లు ప్రతి నెలా పెన్షన్ ఇస్తున్నామని, కళ్యాణ్ లక్ష్మీ పేరుతో రూ.7 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. కేంద్రం నుండి 18 వేల కోట్లు మునుగోడికి ఇవ్వండి అప్పుడు ప్రజలు నమ్ముతరని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో అమ్ముడుపోయినట్టు ప్రజలకు అర్థం అయిందన్న ఆయన... ఇద్దరు అన్నదమ్ముల్ల వల్ల మునుగోడు అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. బండి సంజయ్ గొర్రెల డబ్బులు సీజ్ చేయమని ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు నిరూపించే దమ్ముందా అని సవాల్ విసిరారు.