తండ్రి అస్థికలు నీటిలో కలిపేందుకు వెళ్లి.. అన్నదమ్ములు మృతి

తండ్రి అస్థికలు నీటిలో కలిపేందుకు వెళ్లి.. అన్నదమ్ములు మృతి

మెదక్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి అస్థికలు నీటిలో కలిపేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు..  నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. సమాచారం అందుకుని వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల  సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను దవాఖానకు తరలించారు.

మెదక్-కామారెడ్డి సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులను రాజాంపేట మండలం ఇనాం తండాకు చెందిన చవాన్ హరిసింగ్( 45 ) బాల్ సింగ్( 41)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.