హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని ఇద్దరు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు 6 వ వార్డు ములకలపల్లి రాం గోపి ,19 వ వార్డు కౌన్సిలర్ అట్లూరి మంజులతో పాటు సీనియర్ లీడర్ అట్లూరి హరిబాబు మంగళవారం హైదరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు, నేతలు ఈడుపుగంటి సుబ్బారావు , గెల్లి రవి, ఐఎన్టీయూసీ స్టేట్ లీడర్ యరగాని నాగన్న గౌడ్, ఎండీ నిజాముద్దీన్, శివరామ్ తదితరులు పాల్గొన్నారు.