- కండువాలు కప్పిన మైనంపల్లి హన్మంతరావు
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట మున్సిపాల్టీకి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో గురువారం కాంగ్రెస్ లో చేరారు. 43వ వార్డు కౌన్సిలర్ పయ్యావుల పూర్ణిమ ఎల్లం, 14 వ వార్డు కౌన్సిలర్ ఆలకుంట కవితలతో పాటు మరో ఐదురుగురు నాయకులు హైదరాబాద్ లో కాంగ్రెస్ లో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి మైనంపల్లి హన్మంతరావు పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ పాల్గొన్నారు. ఇటీవలే ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరగా ఇప్పుడు ఇద్దరి చేరికతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య ఐదుకు చేరింది. చైర్ పర్సన్ భర్త అవినీతిని వ్యతిరేకించే తాము పార్టీని వీడామని కౌన్సిలర్లు పేర్కొన్నారు.