Video Viral : వామ్మో .. బట్టల షాపులో ఎద్దులు రెచ్చిపోయాయి

Video Viral : వామ్మో .. బట్టల షాపులో ఎద్దులు రెచ్చిపోయాయి

ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని భయాన్ని కలిగించేలా వీడియోలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా రెండు ఎద్దులు పోట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో చూస్తే అందులో ఓ రెండు ఎద్దులు భయంకరంగా పోట్లాడుకుంటున్నాయి.  ఓ బట్టల  దుకాణంలోకి దూరి అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేశాయి.  కొన్నిసార్లు జంతువులు  వాటికవే  దాడులు చేసుకుంటాయి.  ఎద్దులు అయితే   పొడుచుకుంటాయి.  వాటి పోట్లాడ చూస్తే జనాలు బెంబేలెత్తుతారు. అవి ఎక్కడ మీద పడతాయోనని పరుగులు పెడతారు.  తాజాగా రెండు ఎద్దులు బట్టల షాపులో దూరి మరీ దాడులు చేసుకున్నాయి. 

దుకాణంలోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎద్దులను చూసి షాప్ లో ఉన్న ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. అలా వారు బయటకు వచ్చిన తర్వాత ఓ ఎద్దు మరో ఎద్దు పై దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ గొడవలో అవతలి ఎద్దు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న అదుపు తప్పి ఆ షాపులోని దుస్తులపై పడింది. ఈ నేపథ్యంలో ఎద్దు చేసిన పనికి షాపులోనే దుస్తులని నేలపై పడ్డాయి.

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రెండు ఎద్దులు  మార్కెట్ లో ఒకదానికి మరొకటి ఎదురుపడ్డాయి. మరీ వాటికి ఏమనిపిచ్చిందో ఏమో కానీ.. ఒక్కసారిగా కుమ్ముకోవడం మొదలెట్టాయి. అంతేకాకుండా.. అక్కడే ఉన్న బట్టల షాపులోకికూడా దూరిపోయాయి. ఒకదాన్ని మరొకటి బలంగా నెట్టుకుంటూ షాపులోకి వెళ్లిపోయాయి. షాపులో ఉన్న కస్టమర్లు కూడా భయంతో దూరంగా వెళ్లిపోయారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎద్దులను అదిలించే ప్రయత్నం చేశారు.

షాపులోనే దుస్తులని నేలపై పడడంతో ...  వాటిని చిందరవందరగా చేశాయి. ఈ సమయలో మొత్తం ప్రజలు షాపు బయట నిలబడి భయం భయంగా చూస్తున్నారు. రెండు ఎద్దులు అంత బీభత్సాన్ని సృష్టిస్తున్న సమయంలో లోపలికి వెళ్లే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. ఆ ఎద్దులు చాలాసేపు వరకు బట్టల దుకాణంలో బీభత్సాన్ని సృష్టించాయి. బీభత్సం సృష్టిస్తున్న సమయంలో అక్కడ కొందరు ఘటనకు సంబంధించిన వీడియోలు తీసి Arhant Shelby అనే ఖాతా నుంచి ట్విట్టర్​ లో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ గా మారడంతో నెటిజన్స్​ స్పందించారు. 

 ఈ ఎద్దులకు కొట్లాడుకోవడానికి మరెక్కడా స్థలం లేనట్లుగా దుకాణంలోకి దూరాల అంటూ  ఒకరు కామెంట్ చేయగా... మరికొందరు వామ్మో.. ఇటువంటి యుద్ధం చూస్తుంటే భయమేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. కొన్నిసార్లు రోడ్డుపైన ఉండే జంతువులు క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. మనదారిన మనం వెళ్తున్నదాడులకు దిగుతుంటాయి. కొందరు రోడ్ల పైన ఆవులను, ఎద్దులను వదిలేస్తుంటారు. అవి రోడ్డుపైన దొరికే ఆహార పదార్థాలను తింటు ఉంటాయి. అక్కడక్కడ దుకాణాదారులు, కూరగాయల షాపుల వారు వాటికి ఏవైన తినడానికి ఇస్తుంటారు.. మనం రోడ్డుపైన వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఎద్దులు కుమ్ముకుంటాయి. మనదారిన మనం పోతున్న కూడా కొన్నిసార్లు పొడుస్తుంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో జంతువులకు సరైన తిండి, నీళ్లు దొరక్క ఆవులు,ఎద్దులు లేదా కుక్కలు కూడా వింతగా ప్రవర్తిస్తుంటాయి. వాటి పక్కన నుంచి వెళ్లిన కూడా.. దాడులకు పాల్పడుతాయి.