సూర్యాపేట హైవేపై రెండు ప్రైవేట్ బస్సులు దగ్ధమయ్యాయి.ఇవాళ ఉదయం చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద హైవేపై సాంకేతిక కారణాల వల్ల రెండు ప్రైవేట్ బస్సులు నిలిచిపోయాయి. ఓ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగి దాని ముందున్న మరో బస్సుకు అంటుకున్నాయి.
నిమిషాల వ్యవధిలోనే రెండు బస్సులకు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఎగిసి పడుతున్న మంటల్ని చూసి రహదారిపై వెళ్లేవారు భయబ్రాంతులకు గురయ్యారు. ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.