రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ PVNR ఎక్స్‌ప్రెస్ వే పై స్కోడా కారు బీభత్సం సృష్టించింది. ముందు వెళుతున్న కారు ను స్కోడా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్స్ ఒపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.
ఘటనా స్థలానికి వచ్చిన రాజేంద్ర నగర్ పోలీసులు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమన్నారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు సిబ్బంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.