
- మరో నలుగురికి తీవ్ర గాయాలు..
గజ్వేల్, వెలుగు: ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గజ్వేల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గజ్వేల్‌మండలం కొల్గూర్గ్రామానికి చెందిన వెంకటేశ్ తన కుమారుడి బర్త్ డే కోసం బంధువులైన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గొట్టి ముక్కుల గ్రామానికి చెందిన వెంకటేశ్‌గౌడ్, అంబార్‌పేటకు చెందిన సాయిగౌడ్, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నానిలతో కలసి కేక్ తేవటానికి కారులో గజ్వేల్ పట్టణానికి బయలుదేరారు.
తొగుట- గజ్వేల్ రహదారిపై జాలిగామ ఎక్స్‌రోడ్డు వద్దకు చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. దీంతో కారులోని గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్‌గౌడ్ స్పాట్లోనే చనిపోయాడు. తీవ్ర గాయాలపాలైన నలుగురిని 108 సిబ్బంది గజ్వేల్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.