
హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి ORR ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి ఢివైడర్ ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొట్టి అవతలి వైపు మరో కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరుఅక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
అసలేం జరిగిందంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న టాటా జైలో కారు నార్సింగీ దగ్గరకు రాగానే అదుపు తప్పి ఢీ వైడర్ ను ఢీ కొట్టింది. పల్టీలు కొట్టుకుంటూ గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్ట్ వైపు వెళుతున్న మరో టాటా సఫారీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగీ పోలీసులు. మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజేంద్రనగర్ శివరాంపల్లికి చెందిన ఆనంద్ కాంబ్లీగా గుర్తించారు.