రెండు కార్లు ఢీ.. ఆరుగురికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంక్రాంతి సంబరాలు ముగించుకొని తిరిగి హైదరాబాద్ కు వెళుతున్న సమయంలో రెండు కార్లు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  
 
హైదరాబాద్ వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ముందు వెళుతున్న మరో కారును వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో ముందు వెళుతున్న కారు పల్టీలు కొట్టింది. కారు వెనక భాగం నుజ్జు నుజ్జు అయింది. జాతీయ రహదారి 65 విజయవాడ- హైదరాబాద్ మునగాల మండల కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.