కోదాడలో కొట్టుకొచ్చిన కారులో మృతదేహం

కోదాడలో కొట్టుకొచ్చిన కారులో మృతదేహం

సూర్యాపేట జిల్లా కోదాడలో వాన బీభత్సం సృష్టించింది. ఇప్పటికే పట్టణంలోని చాలా ఏరియాలు నీట మునిగాయి. వరద నీటిలో కొట్టుకొచ్చిన కారులో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. కోదాడ మున్సిపాలిటీలోని భారతి పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్న కాలువలో రెండు కార్లు కొట్టుకొచ్చాయి. కారులో ఒకరు చనిపోయాయి ఉన్నారు. గాంధీ నగర్ కు చెందిన నాగం రవి మృతుడిగా పోలీసులు గుర్తించారు. నాలాలో ఉన్న కార్లను క్రేన్ సాయంతో బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read:-వర్షాలపై బల్దియా అలర్ట్.. అధికారులకు ఆమ్రపాలి కీలక ఆదేశాలు

నిన్నటి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ జలదిగ్భందంలో చిక్కుకుంది.  ఏ కాలనీలో చూసినా వరద నీరే కనిపిస్తోంది.  ఇతర ప్రాంతాల నుంచి కోదాడకు రాకపోకలు బంద్ అయ్యాయి. హుజుర్ నగర్ రోడ్డులో పక్కన ఉన్న కాలువలో గల్లంతు అయ్యాడు ఓ వ్యక్తి. గాలింపు చర్యలు చేపట్టిన సిబ్బంది. నిన్నటి నుంచి పట్టణంలో కరెంట్ లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 

నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రజలు. పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్, ఆర్డీవో సూర్యనారాయణ. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.