చెన్నైకి చేరిన HMPV వైరస్.. 24 గంటల్లో భారత్‎లో ఐదు కేసులు నమోదు

చెన్నైకి చేరిన HMPV వైరస్.. 24 గంటల్లో భారత్‎లో ఐదు కేసులు నమోదు

చెన్నై: చైనాను దడదడలాడిస్తో్న్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్‎లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. కర్నాటక రాజధాని బెంగుళూరులో రెండు కేసులు నమోదు కాగా గుజరాత్‎లోనూ ఒక కేసు నిర్ధారణ అయ్యింది. తాజాగా హెచ్ఎంపీవీ వైరస్ తమిళనాడుకు పాకింది. తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం (జనవరి 6)  రెండు హెచ్ఎంపీవీ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు చిన్నారల్లో వైరస్ నిర్ధారణ అయ్యిందని.. వారిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని సీనియర్ వైద్యులు ఒకరు మీడియాకు తెలిపారు. చెన్నైలో నమోదైన రెండు కేసులతో కలుపుకుని భారత్‎లో హెచ్ఎంపీవీ వైరస్ కేసుల సంఖ్య మొత్తం ఐదుకు చేరుకుంది. 

ALSO READ | HMPV కేసులు: మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ లో తాజా పరిస్థితులు ఇలా..

మరోవైపు చైనాలో హెచ్ఎంపీవీ వైరస్‎ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఇదేమీ కొత్త వైరస్ కాదని.. 2001లోనే హెచ్ఎంపీవీ వైరస్‎ను గుర్తించారని తెలిపారు. భారత్‎లో కూడా హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని.. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదని ప్రజలకు ధైర్యం చెప్పారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్‏లోకి ఎంటరైన విషయం తెలిసిందే. 

ALSO READ | భయపడకండి.. కొత్తదేమి కాదు.. HMPV వైరస్‎పై కేంద్రం కీలక ప్రకటన

మొత్తం నాలుగు కేసులో ఇండియాలో వెలుగు చూశాయి. కర్నాటక రాజధాని బెంగుళూరులో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ నిర్ధారణ కాగా.. కోల్ కతాలో ఒకటి, అహ్మదాబాద్‎లో మరో కేసు నమోదు అయ్యింది. హెచ్ఎంపీవీ వైరస్ భారత్‎లో వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని..  పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖకు అప్డేట్ చేయాలని ఆదేశించింది.