ఒకే ఆరోపణపై రెండు కేసులు..హైకోర్టులో లాయర్ సవాల్

ఒకే ఆరోపణపై రెండు కేసులు..హైకోర్టులో లాయర్ సవాల్
  • వివరాలు అందజేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఒక మతం వారి మనోభావాల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారనే కేసులో వేర్వేరు పీఎస్‌ల్లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేయడాన్ని లాయర్‌ కదిరె కృష్ణయ్య హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు ఈ నెల 12న జరిగే విచారణ నాటికి అందజేయాలని జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌ రెడ్డి ఆదేశించారు.

వెంకటేశ్వర సుప్రభాతం గురించి రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్, ఎల్బీనగర్‌ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారని పిటిషనర్ తరఫు లాయర్ తెలిపారు. ఒకే ఆరోపణపై వేర్వేరు కేసుల నమోదు చెల్లదని, పిటిషనర్‌ ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశాలు ఇవ్వాలని లాయర్‌ కోరారు.