పండగ పూట ఘోర రోడ్డు ప్రమాదం .. తల్లి కళ్ల ముందే ఇద్దరు చిన్నారులు మృతి

పండగ పూట  ఘోర రోడ్డు ప్రమాదం .. తల్లి కళ్ల ముందే  ఇద్దరు చిన్నారులు మృతి

మెదక్ జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది.   జిల్లా కేంద్రంలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.   స్కూటీని ఢీ కొట్టింది టిప్పర్. దీంతో స్కూటీ పై  ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా తల్లికి స్వల్ప  గాయాలయ్యాయి. కళ్లముందే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు పోవడంతో తల్లి గుండెలు పగిలేలా రోదిస్తుంది. 

దీపావళి సందర్భంగా టపాసులు తెచ్చుకునేందుకు   పిల్లలను తల్లి స్కూటీపై షాపుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  మృతి చెందిన చిన్నారులు పృద్విరాజ్(12), ఫణితేజ,(10)గా గుర్తించారు.  తల్లి  సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తూ మెదక్ లో ఉంంటుంది.  ఆమె భర్త  టెక్మాల్ మండలంకు చెందిన హోంగార్డ్ శ్రీనివాస్   రెండేళ్ల క్రింద ప్రమాదంలో చనిపోయాడు.  ఇపుడు ఇద్దరు పిల్లలు కూడా కళ్లముందే మృతిచెందడంతో  కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.  రోడ్డుపైనే స్పృహ కోల్పోయిన ఆ తల్లిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.