కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. లేటెస్ట్ గా హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు కరోనా వచ్చింది. నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న చిన్నారులను నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనుమానం వచ్చిన డాక్టర్లు కొవిడ్ టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. చిన్నారులకు ఐసోలేషన్ వార్డులో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
డిసెంబర్ 21న రాష్ట్రంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లోనాలుగు, మెదక్ లో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో మరో కేసు నమోదయ్యింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో 19 అక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది.