ఆడుకుంటుండగా కారు డోర్ లాక్ .. ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

ఆడుకుంటుండగా కారు డోర్ లాక్ .. ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరిగిద్దలో విషాదం చోటుచేసుకుంది.  కారులో ఊపిరాడక  ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.  అమ్మమ్మ  ఇంటికి వెళ్లిన చిన్నారు లిద్దరు  తన్మయశ్రీ(5), అభినయ శ్రీ(4)  కారు లోపల ఆడుకుంటుండగా డోర్ లాక్ పడింది. చిన్నారులు కనిపించడం లేదని వెతుకుతున్న తల్లిదండ్రులు   వెళ్లి చూసే సరికి కారులో అపస్మారక స్థితిలో కనిపించారు.

 వెంటనే తల్లిదండ్రులు చిన్నారులిద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ  చిన్నారులిద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు డోర్ లాక్ కావడానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు.