నిజామాబాద్ బాల్కొండలో విషాదం .. కమిటీ తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్న పిల్లలు మృతి

నిజామాబాద్ జిల్లా బాల్కొండలో  అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలితీసుకుంది.   ఇత్వర్ పేట గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ భవన నిర్మాణం కోసం తీసిన గుంతలోపడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు.  ఇంటినుండి ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడిన చరణ్(5),నాస్తిక్(7) మృతి చెందారు.  చిన్నారుల మృతితో గ్రామంలో విషాదు ఛాయలు అలుముకున్నాయి.  కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  పోస్టుమార్టం కోసం చిన్నారుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

గుంతలు తీసి 15 రోజులయిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  అధికారుల నిర్లక్షమే తమ పిల్లల ప్రాణాలు తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.