ఆడుకుంటూ వెళ్లి బావిలో పడ్డ చిన్నారులు

ఆడుకుంటూ వెళ్లి బావిలో పడ్డ చిన్నారులు
  • ఒకరు మృతి

ములుగు, వెలుగు : బావి పక్కన ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఒకరు చనిపోగా మరొకరు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్నారు. ఈ ఘటన ములుగు మండలం లాలాయిగూడెంలో శనివారం జరిగింది. గోవిందరావుపేట మండలం పాపయ్యపల్లికి చెందిన బానోతు అశోక్‌‌‌‌ అత్తగారి ఊరైన లాలాయిగూడెంలో ఉంటున్నాడు. వీరికి వేదశ్రీ (5)తో పాటు 11 నెలల బాబు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన జాడి లక్ష్మి శ్రీనివాస్‌‌‌‌ కుమార్తె శాంతిక శనివారం తన తమ్ముడితో పాటు వేదశ్రీని తీసుకొని తల్లిదండ్రులు పనిచేస్తున్న పొలం వద్దకు వెళ్లింది.

తల్లిదండ్రులు పొలంలో పనిచేస్తుండగా చిన్నారులు బావి పక్కన ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో వేదశ్రీ, శాంతిక బావిలో పడిపోయారు. శాంతిక తమ్ముడు వెంటనే తన తండ్రి శ్రీనివాస్‌‌‌‌ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. అతడు బావిలో దూకి శాంతికను బయటకు తీశారు. వేదశ్రీ కూడా బావిలో పడిందని చెప్పడంతో పక్కనే పని చేస్తున్న పలువురు వచ్చి బావిలో దూకి వేదశ్రీని కూడా బయటకు తీశారు. అనంతరం ఇద్దరినీ ములుగు ఏరియా హాస్పిటల్‌‌‌‌కు తీసుకురాగా అప్పటికే వేదశ్రీ చనిపోయినట్లు నిర్ధారించగా, శాంతికకు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేస్తున్నారు. శ్రీనివాస్‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.