జీడిమెట్ల, వెలుగు: వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డ ఘటన నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండారి లే అవుట్లోని వేగా అపెక్స్ అపార్ట్మెంట్లో ఉండే శ్రీకాంత్, నాగసాయి దంపతులకు కూతురు సోమశ్రీ (2) ఉంది. శుక్రవారం సాయంత్రం నాగసాయి కూతురిని తీసుకుని ఇంటి ఎదురుగా ఉన్న పార్కులోకి వెళ్లింది.
సోమశ్రీ పార్కులో ఆడుకుంటుండగా.. వీధి కుక్క దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ బాలికను వెంటనే హాస్పిటల్కు తరలించారు. అదే ఏరియాలో ఉండే శ్యామల(6) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా మరో కుక్క దాడి చేసి గాయపర్చింది. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు ఎక్కువయ్యాయని.. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.