జగిత్యాల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి 

జగిత్యాల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి 

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు స్పాట్ లోనే చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెల్గటూరు మండలం పాశిగాం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. జగిత్యాలకు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఒకే స్కూటీపై  వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొడ్డంతో ఈ ప్రమాదం జరిగింది. కోడిపుంజుల తిరుపతి కుటుంబం ధర్మపురి మండలం దమ్మన్నపేటలో ఓ కార్యక్రమానికి వెళ్లివస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8ఏళ్ల కొడుకు, ఏడాది వయస్సున్న పాప చనిపోయింది. తిరుపతితో పాటు ఆయన భార్య మనోజ పరిస్థితి విషమంగా ఉండగా... మరో కొడుకు మాత్రం స్వల్పగాయాలతో బతికి బయటపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పారిపోయిన గుర్తు తెలియని వాహనం కోసం ఆరా తీస్తున్నారు. మృతి చెందినవారిలో తండ్రి తిరుపతితో పాటు... 8 ఏళ్ల కొడుకు ఆదిత్య, ఒక్క ఏడాది పాప ఉండటం విషాదకరం.