రెండు గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారులు…

రెండు గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారులు…

ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ రెండు గోడలమధ్య ఇరుక్కున్నారు. ఈ ఘటన శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా తాడెపల్లి లో జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తాడేపల్లి నులకపేట ఉర్దూ స్కూల్ వద్ద ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ అక్కడే ఉన్న బౌండరీ వాల్ సందులో ప్రమాదవశాత్తు ఇరుక్కున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా గోడల మధ్య ఇరుక్కున్న పిల్లలు… రమణ, మున్నాలుగా గుర్తించారు. అప్పటికే వాళ్లకు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్లుగా గమనించి వారిని సురక్షితంగా రక్షించారు. అయితే వాళ్లు ఆస్కూల్ పిల్లలు కాదని అక్కడి టీచర్లు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.