రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శేరిగూడలో రోడ్డుప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు చిన్నారులను ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందగా మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.కిరాణా షాప్ కు వెళ్తునన్న కాజల్, అభిషేక్ ను ఇబ్రహీంపట్నానికి చెందిన స్కూల్ బస్ ఢీకొట్టింది. చిన్నారి మృతితో రెండు వలస కార్మికుల కుటుంబాల్లో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. దీంతో చిన్నారి కుటుంభ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.