నిజామాబాద్లో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కల దాడి.. తీవ్రగాయాలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. నగరంలోని 7 డివిజన్ పరిధిలో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కల దాడిలో ఓ చిన్నారి(5)కి  చెవి, మరో చిన్నారి(4)కి మెడపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం చిన్నారులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో  హైదరాబాద్కు తరలించారు.  గత కొంత కాలంగా 7వ డివిజన్ పరిధిలో వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ స్థానికులపై దాడుల చేస్తున్నాయని.. అధికారులు స్పందించి వీధికుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.