పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్.. తృటిలో తప్పిన ప్రమాదం.

పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్..  తృటిలో తప్పిన ప్రమాదం.

ముంబైలో ఆదివారం (అక్టోబర్ 13) లోకల్ ట్రైన్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో ఈ ప్రభావం పశ్చిమ రైల్వే ఆపరేషన్స్ పై ప్రభావం పడింది. ముంబై సెంట్రల్ నుండి కార్ షెడ్‌లోకి వెళ్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఖాళీగా ఉన్నకోచ్‌లు పట్టాలు తప్పాయి. 

ఈ విషయం గురించి పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ మాట్లాడుతూ, మధ్యాహ్నం 12.10 గంటలకు రైలు పట్టాలు తప్పాయని తెలిపారు. అలాగే పట్టాలు తప్పిన సమయంలో రైలు ఖాళీగా ఉన్నందున ఎటువంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. కానీ సంఘటనతో సబర్బన్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగిందని, దాదర్ వైపు స్లో ట్రాక్ బ్లాక్‌గా ఉందని వెల్లడించారు.

ప్రమాదం తరువాత చర్చిగేట్ మరియు ముంబై సెంట్రల్ మధ్య స్లో ట్రాక్ నిలిచిపోయింది. దీంతో రైళ్లను ఈ రెండు స్టేషన్ల మధ్య ఫాస్ట్ లైన్‌కు మళ్లించారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.