ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు కానిస్టేబుల్స్ అరెస్ట్..

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర నాయకులే కాకుండా జిల్లా, మండల లీడర్ల ఫోన్లు సైతం ట్యాపింగ్ కు గురైనట్టు నేతలు అనుమానిస్తున్నారు. లెటెస్ట్ గా ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్లగొండ జిల్లాకి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లిఫ్ట్ చేసినట్టు సమాచారం.

 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక టైంలో నాయకుల ఫోన్ ట్యాప్ చేసి విన్నట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత ఎమ్మెల్యే సంభాషణను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాప్ చేసి వినడానికి జిల్లాలో  ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొంతమంది పోలీసులు సహకరించినట్లు ఆధారాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వారిపై కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంత మంది పెద్ద ఆఫీసర్లు సైతం ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.