
హనుమకొండ సిటీ, వెలుగు: హనుమకొండ జిల్లా తరిగొప్పుల పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జి బాలాజీ, కానిస్టేబుల్ ఎన్ రాజును సస్పెన్షన్ చేస్తూ ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ కేసు విషయంలో నిందితుడికి సహకరించేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.